Prabhas : ప్రభాస్ పుట్టినరోజు అంటే డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ రోజు. అందుకే ఉదయం నుంచీ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కేకులు కట్ చేసి హంగామా చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్ ను ఏర్పాటు చేసి తమ హీరోకి అదిరిపోయే గిఫ్ట్ అందించారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆయన నటించే సినిమాల అప్డేట్స్ విషయంలో మాత్రం అభిమానులు హ్యాపీగా లేరని తెలుస్తోంది.

బర్త్ డే స్పెషల్ గా ఒక్కటంటే ఒక్క మంచి అప్డేట్ రాకపోవడం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాతో పాటుగా ‘కల్కి 2898 AD’, మారుతి ‘రాజా డీలక్స్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులోనూ ఈసారి డార్లింగ్ పుట్టినరోజు, దసరా పండుగ ఒకేసారి రావడంతో స్పెషల్ అప్డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుందని అభిమానులు భావించారు. ‘సలార్’ పార్ట్ 1 రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి కచ్చితంగా అందరికీ ఎగ్జైట్ చేసే పబ్లిసిటీ కంటెంట్ వదులుతారని అనుకున్నారు. కల్కి నుంచి కొత్త పోస్టర్, మారుతి మూవీ నుంచి వర్కింగ్ స్టిల్ వస్తుందని ఆశించారు. కానీ మేకర్స్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లారు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సలార్’.

ఫస్ట్ పార్ట్ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుండగా.. డార్లింగ్ బర్త్ డే స్పెషల్ గా అన్ని భాషల్లో ఓ పోస్టర్ వదిలారు. కానీ అది వారిని ఏమాత్రం ఎగ్జైట్ చేయలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలా చేస్తే ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.