టాలీవుడ్ లో యూత్ మరియు మాస్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో టాప్ 2 లో ఉంటారు పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో గా నటిస్తున్న చిత్రాలలో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం #OG. ‘సాహూ’ మరియు ‘రన్ రాజా రన్’
లాంటి సినిమాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో విరామం లేకుండా సాగుతుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్ర పొలిటికల్ టూర్ లో బిజీ గా ఉన్నాడు. దీంతో సుజిత్ పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల షూటింగ్ పెట్టుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో విలన్ గ్యాంగ్స్ మీద ఈ సన్నివేశాలను తెరకెక్కించారు. జులై లో పవన్ కళ్యాణ్ లేని షూటింగ్ పార్ట్ మొత్తం అయిపోతుంది. ఆగస్టు నెలలో పవన్ కళ్యాణ్ ఒక 15 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుందట, డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో అభిమానులు మైండ్ బ్లాస్ట్ అయ్యే సర్ప్రైజ్ ఎలెమెంట్స్ చాలానే ఉంటాయట.అందులో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాకి ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది. ఈ చిత్రం లోని పవన్ కళ్యాణ్ క్యారక్టర్ ని ఆయన వాయిస్ ఓవర్ తోనే పరిచయం చేస్తారట. సుజిత్ కి ప్రభాస్ తో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది.

ఆయనకి రెండవ సినిమాతోనే సాహూ రేంజ్ భారీ బడ్జెట్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ అందించాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, ఇక ప్రభాస్ కూడా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ హీరోతో మంచి సన్నిహితంగా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సినిమా కి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, చూడాలి మరి.