Bigg Boss Telugu 7 : ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఆడియన్స్ కి ఈ సీజన్ ఇచ్చినంత కిక్ ఏ సీజన్ కూడా ఇవ్వలేదనే చెప్పాలి. స్టార్ మా ఛానల్ ని టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో ఇండియా లోనే నెంబర్ 1 స్థానం లో నిలబెట్టింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ సీజన్ ముగిసి దాదాపుగా 10 రోజులు అవుతుంది, ఆడియన్స్ ఈ షో ని బాగా మిస్ అవుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ప్రతీ సీజన్ పూర్తి అవ్వగానే బిగ్ బాస్ సెట్స్ వారం రోజుల లోపు పీకేస్తారు. కానీ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ సెట్స్ మాత్రం ఇంకా తియ్యలేదు. పైగా రోజూ సెట్స్ ని శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉన్నారట. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, ఏమైనా విశేషం ఉందా అంటే నిజంగానే విశేషం ఉందనే చెప్పాలి.

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ మరియు మారుతీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది, అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశం కోసం ఒక ఇల్లుని వాడాల్సి ఉందట. రెండు రోజుల పాటు ఆ ఇంట్లో షూటింగ్ ఉంటుంది. అయితే డైరెక్టర్ మారుతీ కి తన విజన్ కి తగ్గట్టుగా హౌస్ ఉండేలా బిగ్ బాస్ హౌస్ అనిపించింది.

కాబట్టి ఆ హౌస్ సెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక రెండు రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో షూటింగ్ జరపబోతున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడో లేదో తెలియదు కానీ, హీరోయిన్ మాళవిక మోహన్ మీద పలు సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.