Prabhas : ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన దాదాపు రెండు నెలల నుంచి ఎలాంటి సినిమాలు చేయడం లేదు, కధలు వినడం లేదు.

పూర్తిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చిన నేపథ్యంలో సలార్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతాడు అనుకుంటే ఆయన ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ జోలికి కూడా వెళ్లకుండా ఉన్నారు. ఇంకా ఆయన రెస్ట్ మోడ్ లోనే ఉన్నారని ఆయన ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి కానీ సినిమాలు చేయడం మొదలుపెట్టడానికి గాని సమయం పట్టే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ప్రభాస్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటో తేదీని సినిమా ట్రైలర్ రిలీజ్ గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనే మోకాలి సర్జరీ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభాస్ పబ్లిక్ లో కనిపించబోతున్నాడు.