Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘కే.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ కోసం ఫాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన సలార్ రాబోయే పాన్ ఇండియా సినిమాలకు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. సినిమా రిలీజ్ కి ఇంకా 12 గంటల సమయం మిగిలి ఉండగానే ‘సలార్’ సినిమాకి సంబంధించి ఏకంగా 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

ఈ విషయాన్ని ‘సలార్’ మూవీ టీం తాజాగా వెల్లడించింది. ఇది డంకీ సినిమాతో పోలిస్తే చాలా ఎక్కువ. దీంతో ప్రభాస్ చరిత్ర తిరగరాసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ సినిమాకి ఎన్ని టికెట్లు తెగాయి అనే విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ అయినా పివిఆర్- ఐనాక్స్, సినీ పోలీస్ మినహాయించి ఇప్పటివరకు 30 లక్షల యాభైవేల టికెట్లు అమ్ముడుపోయాయి.

ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల 25000, నైజాం 6 లక్షలు, నార్త్ ఇండియా 5,25,000, కర్ణాటక 3. 25 వేలు, కేరళలో లక్షన్నర, తమిళనాడులో లక్ష మొత్తం 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. త్వరలోనే అడిషనల్ స్క్రీన్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కాగా ఇది కాకుండా బీసీ సెంటర్స్ లో ఆన్లైన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి లెక్కలు కూడా ఇంకా తేలాల్సి ఉంది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ‘సలార్’ షోలు మొదలవుతున్న తరుణంలో సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే సలార్ మూవీకి 100 నుంచి 150 కోట్ల మధ్య ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.