Raja Saab : ‘సలార్’ సక్సెస్ తో మంచి స్పీడ్ మీదున్న ప్రభాస్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం ‘కల్కి’,’రాజా సాబ్’ చిత్రాలపై పెట్టాడు. కల్కి మూవీ షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ ఏడాది మే 9 వ తారీఖున ఈ సినిమా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి సూపర్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా తో పాటుగా సమాంతరంగా ‘రాజా సాబ్’ కి డేట్స్ కేటాయిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాజా సాబ్ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. హీరోయిన్, కమెడియన్స్ పై పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మారుతీ. మారుతీ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. తన సినిమాల్లో హీరో కి ఎదో ఒక లోపం పెట్టడం ఆయన మార్క్.

‘రాజా సాబ్’ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్లుగా ఉంటుంది కానీ, మారుతీ గత చిత్రాలకు మరియు ఈ చిత్రానికి అసలు పొంతనే లేకుండా ఉంటుందట. రీసెంట్ గానే ప్రభాస్ కి ‘రాజా సాబ్’ సెకండ్ హాఫ్ ని వినిపించాడట డైరెక్టర్ మారుతీ. సెకండ్ హాఫ్ విన్న ప్రభాస్ స్పెల్ బౌండ్ అయ్యాడట. ఈ రేంజ్ స్క్రిప్ట్ నాకు బాహుబలి కి ముందు, బాహుబలి కి తర్వాత కూడా పడలేదని మారుతీని పొగడ్తలతో ముంచి ఎత్తాడట ప్రభాస్.

ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే లేని విధమైన ట్విస్ట్ ఉంటుందట. అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా బైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉండే సీక్వెన్స్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని, అలాంటి స్క్రిప్ట్ కి ప్రభాస్ స్టార్ స్టేటస్ తోడైతే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఊహకి కూడా అందని రేంజ్ లో ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.