పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు అది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అని, బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టార్ స్టేటస్, ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళింది.
ఆయన ఎలాంటి సినిమా తీసిన టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు ఎంత వసూళ్లను రాబట్టలో అంత వసూళ్లను రాబట్టేస్తుంది. టాక్ రాకపోతే ప్రస్తుతం రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కి అయినా, ఖాన్స్ లాంటి బడా స్టార్స్ కి అయినా మొదటి రోజు మ్యాట్నీ షోస్ నుండే ఖాళీ అయిపోతున్నాయి. అలాంటిది ప్రభాస్ కేవలం మూడు రోజుల్లోనే నెగటివ్ టాక్స్ తో ఇండియన్ స్టార్ హీరోలందరి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని దాటేస్తున్నాడు.
ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. బాహుబలి నుండి ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ వరకు మొత్తం 5 సినిమాలు విడుదలైతే అందులో నాలుగు సినిమాలు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తున్నాయి. ఇది నిజంగా భవిష్యత్తులో ప్రభాస్ కి తప్ప మరో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కి కూడా సాధ్యం కాదని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు.
కొంతమంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఇంత వసూళ్లు రావడం కష్టమని, ప్రస్తుతం స్టార్ స్టేటస్ పరంగా ప్రభాస్ కి దీటుగా నిలబడే స్టార్ ఎవ్వరూ లేరని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక సెప్టెంబర్ నెలలో విడుదల అవ్వబొయ్యే ‘సలార్‘ చిత్రానికి పొరపాటున సూపర్ హిట్ టాక్ వస్తే, రెండు వారాల్లోనే 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటి , బాహుబలి ఫుల్ రన్ కలెక్షన్స్ ని కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.