Raja Saab : ‘రాజా సాబ్’ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. ఇది వర్కౌట్ అయ్యేలా ఉందే..

- Advertisement -

Raja Saab టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ప్రభాస్ వరుస సినిమాల పై ఫోకస్ పెట్టాడు.. వరుస సినిమా ఆఫర్లను అందుకని బిజీ లైనప్‌తో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా పై క్రేజీ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా ప్రభాస్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ చేసాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

Raja Saab
Raja Saab

మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలవడంతో రాజా సాబ్ సినిమా కూడా భారీ సక్సెస్ ను అందుకుంటుందని టాక్.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. 2025 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే రిలీజ్ చేయాలని మాస్టర్ ప్లాన్‌లో టీం ఉన్నట్లు తెలుస్తోంది..

మాములుగా సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందుకే జనవరి 2,3 తేదీల్లో సినిమాను విడుదల చేస్తే మంచి సక్సెస్ ను అందుకోవచ్చునని డార్లింగ్ మారుతికి సలహా ఇచ్చారట.. దానికి మారుతి కూడా ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.. ఇక రాజాసాబ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి తో బ్లాక్ బస్టర్లు అందుకని దూసుకుపోతున్న ప్రభాస్.. రాజాసాబ్‌ నాన్ ధియేట్రికల్‌ హక్కులకు కూడా ఊహించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here