Prabhas అంత తేలికగా ఎవ్వరినీ ఇష్టపడడు, ఒకవేళ ఇష్టపడితే మాత్రం జీవితాంతం వాళ్లకు అండగా నిలుస్తాడు, ప్రేమిస్తాడని ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఇది వరకు ఎంతోమంది ఇంటర్వ్యూస్ లో ఇది వరకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా ప్రభాస్ కి బాగా ఇష్టమైన వారిలో ఒకరు పూరి జగన్నాథ్. పూరితో కలిసి ప్రభాస్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసాడు.
అందులో ‘బుజ్జిగాడు’ ఒకటి, ‘ఏక్ నిరంజన్’ మరొకటి. ఈ రెండిట్లో బుజ్జిగాడు చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినా, ‘ఏక్ నిరంజన్’ మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కూడా ప్రభాస్ కి పూరి జగన్నాథ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్, కానీ పూరి జగన్నాథ్ తో ప్రస్తుతం సినిమాలు చెయ్యడానికి ఏ స్టార్ హీరో కూడా సిద్ధంగా లేరు.
కానీ ప్రభాస్ మాత్రం పూరి జగన్నాథ్ తో సినిమాలు చెయ్యడానికి ఇప్పటికీ సిద్దంగానే ఉన్నాడట. కానీ పూరి జగన్నాథ్ ప్రభాస్ ఇమేజి ని మ్యాచ్ చేసే కథ తన దగ్గర లేదని ప్రభాస్ ని ఇంకా సంప్రదించలేదట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ పూరి గురించి మాట్లాడుతూ ‘ ‘బుజ్జిగాడు’ సినిమా షూటింగ్ సమయంలోనే పూరి జగన్నాథ్ కి నేను ఫిదా అయిపోయా.
ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటుంది. గతం లో నేను ఆయన సినిమాలన్నీ చూసాను, అవన్నీ నాకు నచ్చబట్టే అతనితో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఆయన టేకింగ్ లో ఎదో మ్యాజిక్ దాగి ఉంటుంది, ఎవరైనా సరే పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే అతనితో ప్రేమలో పడిపోతారు. ఇప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం ఇస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.