Mahesh Babu : ఆ అగ్రదర్శకుడిని తన సెక్యూరిటీ తో బయటకి గెంటేసిన మహేష్ బాబు.. కారణం అదే!

- Advertisement -

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రం వరకు ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి, డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఆడినా, ఆడకపోయినా కథలో ఎదో ఒక వైవిద్యం దాగి ఉంటుంది.

Mahesh Babu
Mahesh Babu

అందుకే మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ టాలీవుడ్ లోనే ది బెస్ట్ అని ఇతర హీరోల అభిమానులు సైతం అనుకుంటూ ఉంటారు. అయితే ఒక డైరెక్టర్ విషయం లో మాత్రం మహేష్ బాబు చాలా మోసపోయాడట. తనకి ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చిన పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్ ని కూడా మహేష్ ఈ డైరెక్టర్ ని నమ్మినంత నమ్మలేదట. కేవలం తనకి గతం లో ఒక సూపర్ హిట్ ఇచ్చాడనే కారణం తో స్క్రిప్ట్ కూడా వినకుండా డేట్స్ ఇచ్చేశాడట.

Mahesh Babu Updates

మహేష్ బాబు లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఒక డైరెక్టర్ ని అంతలా నమ్మి డేట్స్ ఇచ్చాడంటే, కచ్చితంగా డైరెక్టర్ కి తనని తానూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ డైరెక్టర్ కి వచ్చిన ఈ బంగారం లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. మహేష్ స్క్రిప్ట్ కూడా చదవనుకుండా అతన్ని నమ్మి సినిమా చేసాడు. సినిమా మధ్యలో ఉండగా ఒకరోజు రషెస్ చూసాడు. అవి చూసాక మహేష్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యిందట.

- Advertisement -
Mahesh Babu Movies

ఏందీ ఈ సినిమా ఇంత దరిద్రంగా తీసావు?, నా మీద నీకేమైనా కోపం ఉందా? అని అడిగాడట. అయితే సగానికి పైగా షూటింగ్ అయిపోవడం తో మళ్ళీ రీషూట్స్ చేస్తే మొదటికే మోసం వస్తుంది, ఇలాగే పూర్తి చేసి విడుదల చేద్దామని, ఆ సినిమాని పూర్తి చేసి విడుదల చేసాడట. ఫలితం ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ ఆ డైరెక్టర్ ముఖం వైపు కూడా చూడలేదట. ఒకరోజు మహేష్ కి మరో సినిమా స్టోరీ వినిపించడానికి ఇంటికి వెళ్తే, మహేష్ సెక్యూరిటీ బాబు ఇంట్లో లేడని చెప్పి పంపేసారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here