Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ విడుదల వాయిదా..క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

- Advertisement -

Prabhas Kalki : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘కల్కి 2898 AD’. మహాభారతం ఇతిహాసం కి లింక్ చేస్తూ, ఒక డిఫరెంట్ సబ్జెక్టు గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించాడు. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Prabhas Kalki
Prabhas Kalki

మార్చి రెండవ వారం లో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మే 9 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందని, వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది.

అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ మూవీ టీం నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఒక మాస్ సాంగ్ ని చిత్రీకరించారట. ఆ పాట కి సంబంధించిన మొదటి లైన్ ని ప్లే చెయ్యగా, ప్రభాస్ దానికి వైబ్ అవుతూ తన కాళ్ళను ఊపుతూ ఉంటాడు. ఈ వీడియో ని అప్లోడ్ చేస్తూ మే 9 వ తారీఖున విడుదల అవ్వబోతున్నట్టుగా మరోసారి అధికారిక ప్రకటన చేసారు.

- Advertisement -

అంతే కాకుండా సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ సాంగ్ కూడా ఉంది అనే విషయం ఈ వీడియో ద్వారానే తెలిసింది. ఈ చిత్రం లో ప్రభాస్ తో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి లెజెండ్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఇందులో విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here