Rajamouli : పాపం రాజమౌళిని దారుణంగా అవమానించిన కల్కి టీమ్.. ఒక్క ట్వీట్ తో పరువు తీసేశారుగా..

- Advertisement -

Rajamouli : ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ K సినిమాకి తాజాగా కల్కి 2898 AD అనే టైటిల్ అనౌన్స్ చేసి, గ్లింప్స్ రిలీజ్ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, రానా పాల్గొన్నారు.

Rajamouli
Rajamouli

కల్కి 2898 AD గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా ఈ సినిమాని పొగిడేస్తున్నారు. ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా కల్కి సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కూడా కల్కి సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశాడు. రాజమౌళి కల్కి టీజర్ చూసిన అనంతరం.. గ్రేట్ జాబ్ నాగి. అద్భుతమైన భవిష్యత్తు సినిమాని తీస్తున్నావు. ఇది చాలా కష్టం కానీ మీరు పాజిబుల్ చేశారు.

Rajamouli Prabhas

డార్లింగ్ లుక్స్ చాలా బాగున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగారు. దీంతో రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సాధారణంగా రాజమౌళి సినిమాలే చాలా ఆలస్యంగా రిలీజ్ అవుతాయి. అందరూ రాజమౌళిని ఆయన సినిమాల రిలీజ్ డేట్ అడుగుతూ ఉంటారు. అలాంటిది రాజమౌళి వేరే సినిమా రిలీజ్ డేట్ అడగడంతో నెటిజన్లు అంతా సరదాగా కౌంటర్లు వేస్తున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారో చూడండి అని సెటైరికల్ గా ట్వీట్ చేశారు. అదే ట్వీట్ ని హరీష్ శంకర్ కూడా రీ ట్వీట్ చేస్తూ నిజమే, బాగా చెప్పారు శోభు గారు అని కౌంటర్ ఇచ్చారు. ఇక పలువురు నెటిజన్లు కూడా మీరు రిలీజ్ డేట్ అడగడం కొత్తగా ఉంది అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here