Kalki 2898 AD : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి2898ఏడి’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ దాదారు 600కోట్ల రూపాయలతో తెరకెక్కిన చిత్రం ‘కల్కి2898ఏడి’. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, హాట్ బ్యూటీ దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు కల్కి విడుదల కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూన్ 27 వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, మూవీ టికెట్ ధరలు పెంపునకు మేకర్స్ తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరారు. ఈ మేరకు టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినీ ప్రియులకు షాకిచ్చింది. సింగిల్ స్క్రీన్‌పై రూ. 75, మల్టీఫ్లెక్స్‌లో రూ. 100 చొప్పున ధరలు పెంచుకోవచ్చని సూచించినట్లు సమాచారం. అయితే జూన్ 27 ఉదయం పడే బెనిఫిట్ షోకు మాత్రం అత్యధికంగా రూ. 200 పెంపు అదనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ సర్కార్ ఐదు రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో కల్కి మూవీకి ఫుల్ సపోర్ట్ లభించినట్లు అయింది.
ఈ విధంగా చూస్తే కల్కి బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్‌పై రూ. 377, మల్టీఫ్లెక్స్‌లో రూ. 495 ఖర్చు చేయాల్సి వస్తుంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్‌పై రూ. 265, మల్టీఫ్లెక్స్‌లో రూ. 413 అలాగే ఆన్‌లైన్‌లో త్రీడి గ్లాస్ చార్జీలు కలిసి ఒక్క టికెట్ రూ. 500 ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మరీ ఇంత రేటు పెడితే సామాన్యుడు సినిమాకు దూరం అవుతారని చెబుతున్నారు.