Kannappa : మంచు విష్ణు నా మజాకా నా.. కన్నప్ప సినిమా టైం 52గంటలు.. థియేటర్లో ఎన్ని గంటలో తెలుసా ?

- Advertisement -

Kannappa : తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ ఎపిక్ సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన “భక్త కన్నప్ప” మూవీ ఒకటి. ఆ సినిమాకి ఒక స్థాయిని తాను తీసుకొచ్చారు. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సబ్జెక్టుని తెరకెక్కించేందుకు పెద్దగా ఎవరూ సాహసం చేయలేదు. కానీ మంచు విష్ణు కన్నప్ప సినిమానే తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఓ షాకింగ్ అనౌన్సమెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. కాగా మంచు విష్ణు ఈ సినిమానే తన జీవితం అన్న రేంజ్‎లో ఒప్పుకున్న సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. సినిమా యూనిట్ అంతా న్యూజిలాండ్ కి వెళ్లి కొన్ని నెలల పాటు షూటింగ్ చేసి వచ్చేశారు. కాగా ఈ సినిమాని విష్ణు ఎంత ప్రత్యేకంగా తీసుకున్నాడు అంటే నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయిన “మహాభారతం” సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ని తన సినిమా కోసం తెచ్చుకున్నారు.

ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ ఇండియా లోనే ఆల్ మోస్ట్ టాప్ నటీనటులు అంతా ఈ సినిమాలోనే ఉన్నారు. తెలుగు నుంచి ప్రభాస్, మళయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజ నటులు ఈ సినిమాకి ఒప్పుకుని పని చేయడం ఓ సెన్సేషన్. రీసెంట్ గా సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేయగా మంచు వారి గత సినిమాలతో పోలిస్తే కాస్త ఓకే అనిపించే రెస్పాన్స్ వచ్చింది. ఇక వీటితో పాటుగా తాజాగా ఓ షాకింగ్ రూమర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి ఇపుడు వరకు ఏకంగా 52 గంటల ఫుటేజ్ వచ్చిందన్న మాట వైరల్ అవుతోంది. ఆఖరికి ఈ సినిమాను 3 గంటలకి కుదించారు అని అంటున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ లో ఎలాంటి ట్రోల్స్ పడుతుటాయో అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఓ సినిమాకి 52 గంటల ఫుటేజ్ అంటే నమ్మశక్యంగా లేదు. అలా కేవలం ట్రోలింగ్ గా మాత్రమే ఇది పుట్టిందని కొందరు అంటున్నారు. మొత్తానికి కన్నప్ప తో మాత్రం మంచు విష్ణు ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నారు. మరి తాను పెట్టుకున్న ఆశలన్నీ ఈ సినిమాతో నెరవేరుతాయో లేక మళ్ళీ ట్రోల్స్ కే గురవుతాడో చూడాలి. కాగా ఈ సినిమాని మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాలం సహా గ్లోబల్ భాష ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతుంది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here