Prabhas కు ఇంకా మోకాలు చికిత్స జరగలేదా.. ఈ ఫొటోనే అందుకు సాక్ష్యమా..!

- Advertisement -

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ‘సలార్’ రిలీజ్ కి ముందు శాస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం యూరప్ వెళ్లారు. చికిత్స చేయించుకున్న తరువాత అక్కడే నెల పాటు విశ్రాంతి తీసుకోని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చారు. ఇక వచ్చిన తరువాత ప్రభాస్ కొంచెం జోష్ కనిపించడంతో..

Prabhas

ప్రతి ఒక్కరు ఆయన కోలుకున్నారని భావించారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో.. ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా అనే సందేహాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై ఓ రొమాంటిక్ పాటని చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ షూటింగ్ సెట్స్ నుంచి ఏదొక ఫోటో బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతుంది. ఈక్రమంలోనే తాజాగా ప్రభాస్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతున్న ఫోటో బయటకి వచ్చింది.

ఆ ఫొటోలో ప్రభాస్.. చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు.. ప్రభాస్ కి ఇంకా మోకాలి నొప్పి తగ్గినట్లు లేదనుకుంటా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ మోకాలి సమస్యకి కొంచెం ఎక్కువ కాలమే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. మరికొందరు మాత్రం అసలు చికిత్స జరిగిందా లేదా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here