Mahesh Babu : లయన్ కింగ్‍లా మహేశ్! హెయిర్ ఊగిన క్లిప్ వైరల్

- Advertisement -

Mahesh Babu : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో SSMB29 సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో బిజీ కాకముందే మహేష్ కొన్ని యాడ్స్ చేస్తున్నాడు. తాజాగా మహేష్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మహేష్ బాబు చేసిన ఓ యాడ్ వీడియో బయటకు వచ్చింది. ఈ యాడ్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ విడుదలైంది. ఇందులో మహేష్ బాబు పొడవాటి జుట్టుతో కొత్త లుక్‌తో కనిపించాడు. ఈ ప్రకటనలో యాక్షన్ స్టంట్ ఉంది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు మహేష్ ఈ యాడ్ లో రిస్క్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఈ యాడ్ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్ లా సాగింది. ఈ యాడ్‌లో మహేష్ బాబు కనిపించిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహేష్ పొడవాటి జుట్టు గాలికి ఊపుతున్న క్లిప్ వైరల్ అవుతోంది. కొందరు మహేష్ లుక్ ని సింహంతో పోలుస్తున్నారు. లయన్ కింగ్‌గా మహేష్ గురించిన ఓ మీమ్ కూడా వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు ప్రపంచాన్ని ఉర్రూతలూగించనున్నాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం (SSMB29) గ్లోబల్ రేంజ్ లో ఉంటుంది. యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే జక్కన్న చెప్పాడు. తాజాగా ఈ సినిమా లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ డిఫరెంట్ గెటప్ లను ట్రై చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో SSMB29 సినిమా రూపొందనుందని రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటులు కూడా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ నటిస్తుందనే టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే షూటింగ్ కు ముందు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి RRR సినిమాతో హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఈ సినిమాపై గ్లోబల్ రేంజ్ లో భారీ బజ్ నెలకొంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here