కృతి సనన్.. టాలీవుడ్, బాలీవుడ్లో ఈ బ్యూటీదే హవా. ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో కృతి తన నటనతో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు చాలా ట్రెడిషనల్గా రెడీ అయి వచ్చింది. అచ్చం సీతాదేవిలాగా సంప్రదాయంగా తయారై ఈవెంట్కు హాజరైంది.

క్రీమ్ కలర్ శారీలో.. జుట్టును ముడివేసుకుని.. తలలో మల్లెపూలు పెట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకుని అచ్చతెలుగు పదహారణాల అమ్మాయిలా అలరించింది. ప్రస్తుతం కృతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కృతి ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ సీతలా సెట్ కాదని అనుకున్నాం కానీ.. ఈ ఔట్ఫిట్లో చూశాక అర్థమైంది కృతి సీత క్యారెక్టర్కు పర్ఫెక్ట్ ఫిట్ అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

మోడల్గా మెప్పించిన కృతి సనన్.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో మహేశ్ బాబుతో కలిసి టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఆ మూవీలో కృతి అందం, అభినయానికి ప్రేక్షకులు దాసోహమయ్యారు. కొన్నాళ్ల తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచెయ్సినిమాలో నటించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ తెలుగు తెరకు దూరమైంది.

ఆ తర్వతా ఈ బ్యూటీ బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్తో కలిసి హీరోపంతి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు ప్రభాస్తో కలిసి ఆదిపురుష్ లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇందులో సీత పాత్రలో మెప్పించబోతుంది కృతి సనన్.

ఈ మూవీతో మరోసారి కృతి టాలీవుడ్కు దగ్గరవ్వాలని చూస్తోంది. ఆది పురుష్ ప్రమోషన్స్తో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై మళ్లీ టాలీవుడ్కు కమ్ బ్యాక్ ఇచ్చే ప్లాన్లో ఉందట.