Venu Swamy గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. ఒక్క సమంత విషయంలో ఈయన చెప్పింది జరగడంతో మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. అయితే ఈ ఏడాదిలో వేణుస్వామి చెప్పింది ఏది జరగకపోవడంతో ప్రతిఒక్కరు ఆయనపై ఫైర్ అవుతున్నారు.

ఇండియా వరల్డ్ కప్ ఈ ఏడాది కొడుతోంది అని చెప్పుకొచ్చాడు.. అది జరగలేదు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతాడు అని చెప్పుకొచ్చాడు. అది కూడా జరిగింది లేదు. ఇక ఈ ఏడాది వేణుస్వామిని ట్రోల్ చేయడానికి, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కార, కొన్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం ఈయన చెప్పడమే. ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదు అని చెప్పాడు. ఇక పెళ్లి గురించి ఏమో కానీ.. నేడు సలార్ సినిమా హిట్ అవ్వడంతో వేణుస్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు.

ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు. పనైపోయింది అన్నావ్ కదా. ఇప్పుడు చెప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్.. అంటూ చెప్పుకొస్తున్నారు. మాములుగా ప్రభాస్ జాతకాలు నమ్మడట. వాళ్ళ కుటుంబంలో మిగిలినవారు చెప్పడం తప్ప ఏరోజు ప్రభాస్ వీటిని పట్టించుకోలేదని వేణుస్వామి స్వయంగా చెప్పుకొచ్చాడు. కష్టాన్ని నమ్ముకోవడమే కానీ, జాతకాల మీద ఆధారపడేవాడు కాదు డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి యోగం లేదన్న వేణుస్వామి మాటలను మళ్లీ బ్రేక్ చేస్తూ. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి కబురు చెప్తాడేమో చూడాలి.