Unstoppable 2 With NBK : బాలయ్యకు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘ఆ రోజు రూమ్​లో ఏం జరిగిందో తెలుసుకోండంటూ..’

- Advertisement -

Unstoppable 2 With NBK : నందమూరి బాలకృష్ణ వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూనే.. ఓటీటీలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అంటూ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు. చిరంజీవి, నాగార్జున కూడా ఇప్పటి వరకు షోలు హోస్ట్ చేశారు. కానీ బాలయ్యకు మాత్రం హోస్ట్ గా వస్తోన్న క్రేజ్ మామూలుగా లేదు. అన్ స్టాపబుల్ షోకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో ఆ టీమ్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. సెకండ్ సీజన్ లోనూ ఈ షో దూసుకెళ్తోంది. 

Unstoppable 2 With NBK
Unstoppable 2 With NBK

అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొనబోతున్నారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ బాహుబలి ఎపిసోడ్ త్వరలోనే రాబోతోంది అంటూ ప్రభాస్, బాలకృష్ణలతో కూడిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ను బాలయ్య అడగడానికి ఒక క్రేజీ క్వశ్చన్ చెప్పాలని రెబల్ స్టార్ అభిమానులను అడిగింది ఆహా. దీనికి డార్లింగ్​ ఫ్యాన్స్​ ఏం ప్రశ్నలు అడగమని రిక్వెస్ట్ లు పెట్టారో ఓ లుక్కేద్దామా..

Prabhas

ఆహా రిక్వెస్ట్ తో ప్రభాస్ అభిమానులు కామెంట్ల సెక్షన్‌లో చెలరేగిపోతున్నారు. తమకు తోచిన క్రేజీ ప్రశ్నలను సంధిస్తున్నారు. అయితే, వీటిలో ఒక క్రేజీ ప్రశ్న చాలా మంది అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ ప్రశ్నను అడగాలని ఆహాను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ చూస్తుంటే బాలయ్య ఆ క్వశ్చన్ కచ్చితంగా ప్రభాస్ ను అడుగుతారనే అనిపిస్తోంది. ఇంతకీ ఆ క్వశ్చన్టే ఏంటంటే..?

- Advertisement -

ఆదిపురుష్ టీజర్ విడుదలైన తరవాత దాని మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో దర్శకుడు ఓం రౌత్‌ను ప్రభాస్ చాలా సీరియస్‌గా.. ‘ఓం కమ్ టు మై రూం’ అని పిలిచారు. దీంతో కచ్చితంగా ఓంను తిట్టేందుకే ప్రభాస్ రూంలోకి పిలిచారంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత ప్రభాస్ పిలిచింది అందుకు కాదని టీం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆరోజు రూంలో ఏం జరిగిందనే ఆసక్తి ఇప్పటికీ చాలా మంది రెబల్ స్టార్ అభిమానుల్లో ఉంది. అందుకే, అదే ప్రశ్న ప్రభాస్‌ను బాలయ్య అడగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

ఫ్యాన్​ అడగమన్న ప్రశ్న అలాగే, ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలను ప్రభాస్ ఫ్యాన్స్ అడగమంటున్నారు. అవేంటో చూద్దాం.

  • ఫస్ట్ టైమ్ ఏ హీరోయిన్‌ను చూస్తే పెళ్లి చేసుకోవాలని అనిపించింది?
  • బోయపాటితో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
  • ఛాన్స్ వస్తే బాలయ్యతో మాస్ మూవీ చేస్తారా?
  • ప్రభాస్, కృతి సనన్ మ్యాటర్ అడగమనండి.. నేషన్ వాంట్స్ టు నో!
  • నెత్తి మీద క్లాత్​ ఎక్కడ కొన్నారో కనుక్కోండి?

 ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. ఈ ప్రశ్నల కింద మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ వేసే జోకులు నెక్ట్స్ లెవెల్. మొత్తానికి ఆహా ట్విట్టర్ ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మంచి క్రేజీ డిస్కషన్ పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here