Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు ఇండియా లో ఉన్న మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది.
కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో రీ షూట్ కూడా చేసారు. ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘సలార్’ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ట్రైలర్ ని విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షకి పైగా లైక్స్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం.
ఈ ట్రైలర్ మీద భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు మాత్రం బాగా నిరాశకి గురి అయ్యారు. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ లో ప్రభాస్ కంటే ఎక్కువగా పృథ్వీ రాజ్ ఉన్నాడు. ఒక్కసారిగా చూసే ఫ్యాన్స్ కి అసలు ఏమి జరుగుతుంది, ఇందులో హీరో ప్రభాసా? లేకపోతే పృథ్వీ రాజా? అనే సందేహం కలిగింది అందరిలో. పోనీ స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా అంటే అది కూడా లేదు.
స్నేహితుడి కోసం ఏమైనా చేసే వాడిగా ప్రభాస్ ఇందులో కనిపిస్తాడు. స్నేహితుడి కోరిక మేరకు రాజ్యం మొత్తాన్ని అతనికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నాలలో ఎదురైనా పరిస్థితులే సలార్ కథ అనేది తెలుస్తుంది. అయితే ట్రైలర్ మొత్తం మీద వావ్ అనిపించే ఒక్క షాట్ కూడా లేకపోవడం బాధకారం, సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది అని చెప్పొచ్చు.