Prabhas : ఫారిన్ లో పెద్ద విల్లా కొన్న ప్రభాస్.. కారణమిదేనా..!

- Advertisement -

స్టార్ హీరో Prabhas పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుంది.. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటుగా సందీప్ వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ కూడా ఇదే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.

Prabhas
Prabhs

హను రాఘవపూడితోనూ ప్రభాస్ ఓ సినిమాను ఓకే చేశాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మొత్తంగా డార్లింగ్ నాలుగు, ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు లండన్ కూడా వెళ్లి వస్తాడు. అందుకోసమే అక్కడ ఓ లగ్జరీ హౌస్ ను తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లే ఆ ఇల్లు ఉందని సమాచారం. అక్కడ ఎందుకు ఇల్లు తీసుకున్నాడని చాలా మంది ఆలోచనలో పడ్డారు. అయితే ప్రభాస్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసిందే.

- Advertisement -

ఆయన ఎక్కువగా లండన్ వచ్చి చికిత్స లు చేయించుకుంటారు.. గతంలో ఓ సర్జరీ కూడా చేయించుకున్న విషయం తెలిసిందే. అక్కడ హోటల్స్ ఉండటం ఇష్టంలేకే ఒక ఇంటిని రెంటుకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో లేడని, లండన్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడో అనే రూమర్లు వస్తూనే ఉంటాయాన్న సంగతి తెలిస్తే ఈ విషయం పై ప్రభాస్ కూడా లైట్ తీసుకున్నాడు మరి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here