Prabhas: ప్రభాస్ గురించి పిచ్చిగా మాట్లాడితే చెప్పులతో కొట్టిస్తా అంటూ వేణు స్వామి కి వార్నింగ్ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలా!

- Advertisement -

Prabhas: సోషల్ మీడియా లో సెలెబ్రిటీల జాతకాల గురించి నోటికి వచ్చింది మాట్లాడుతూ బాగా పాపులారిటీ ని సంపాదించిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని యాదృచ్చికంగా నిజం అవ్వడంతో, వాటిని అడ్డం పెట్టుకొని ప్రముఖ స్టార్ హీరోలు , మరియు రాజకీయ నాయకులూ మీద ఈయన హద్దులు దాటి చేస్తున్న కొన్ని కామెంట్లు నెటిజెన్స్ కి చిరాకు కలిగిస్తుంది. ఒక పరిమితి వరకు ఎవరైనా సహిస్తారు. హద్దులు దాటితే ఎవరు మాత్రం సహిస్తారు చెప్పండి.

హీరోలు , హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇతనికి వచ్చి తమ జాతకాలు మొత్తం ఇచ్చినట్టు, ఆయన చూసినట్టు చెప్తున్నాడు. నిజమైన జ్యోతిష్యుడు పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం తో పాటుగా, సమయం సెకండ్లు కూడా పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా గ్రహాలు స్థితిగతులను ఆధారంగా చేసుకొని జాతకాలు చెప్తారు. కానీ వేణు స్వామి అలా ఎప్పుడు చెయ్యలేదు, ఎందుకంటే ఇతనికి ఎవ్వరూ తమ జాతకాల వివరాలు ఇవ్వలేదు.

రీసెంట్ గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి వేణు స్వామి కామెంట్స్ పై స్పందించింది. మొదటి నుండి వేణు స్వామి ప్రభాస్ జాతకం పై ఎలాంటి కామెంట్స్ చేసేవాడో మనమంతా చూసాము. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని,అది ఆయన ప్రాణాలకే ముప్పు అని చెప్పిన మాటలు అభిమానులను బాగా డిస్టర్బ్ చేసింది. అంతకు ముందు ప్రభాస్ కి బాహుబలి సిరీస్ తర్వాత ఇక హిట్లు ఉండవు అని కామెంట్ చేసాడు.

- Advertisement -

వీటిపై శ్యామల దేవి మాట్లాడుతూ ‘ఈమధ్యనే ఒక వ్యక్తి ప్రభాస్ జాతకం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అతని ప్రాణాలకు ముప్పు ఉందని నోటికి ఏది తోచితే అది చెప్పాడు. ప్రభాస్ జాతక వివరాలు కేవలం ఆయన తల్లి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇతనికి ఎప్పుడు ఆమె జాతక వివరాలు ఇచ్చింది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అభిమానులు అతినికి చెప్పులతో ఎదో ఒకరోజు దేహశుద్ది చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల దేవి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here