Prabhas : ‘ఆది పురుష్’ మూవీ ప్రొమోషన్స్ కి ప్రభాస్ దూరం..? కారణం తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -

Prabhas ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఆదిపురుష్’.షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ,జూన్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్ , సీతగా కృతి సనన్ మరియు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు.

Prabhas
Prabhas

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దాం అని అనుకున్నారు. కానీ ఆ టీజర్ లో VFX కి ఘోరమైన నెగటివ్ ట్రోల్ల్స్ రావడం తో ఈ చిత్రం విడుదల ని జూన్ 16 వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు VFX ఔట్పుట్ బాగా వచ్చిందని, కచ్చితంగా ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనే బలమైన నమ్మకం తో ఉంది మూవీ టీం.

Prabhas adipurush

అంత బాగానే ఉంది కానీ, ఈ సినిమా ప్రొమోషన్స్ కి ఇందులో విలన్ గా చేసిన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దూరం గా ఉండబోతున్నట్టు సమాచారం. అందుకు కారణం ఆయనకీ తీరిక లేకపోవడమే. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లో విలన్ గా నటిస్తున్నాడు. ఈమధ్యనే ఆయన రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ మొత్తం పూర్తి అవ్వగానే ఆయన సమ్మర్ టూర్ కి వెళ్లనున్నాడట.

- Advertisement -

అందువల్ల ఆయన ఆది పురుష్ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కేవలం రెండు ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొంటాడట, ఆయన కూడా ప్రొమోషన్స్ ఇంతకు ముందు లాగా చేసే పరిస్థితి లేదని, ప్రస్తుతం ఆయన మూడు సినిమాల షూటింగ్స్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడని తెలుస్తుంది.మరి తక్కువ ప్రొమోషన్స్ తో ఆదిపురుష్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా నెగ్గుకురాగలదో చూడాలి.

Prabhas kriti sanon saif ali khan
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here