RRR Movie : రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తగా ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని గెలుచుకున్న ఈ చిత్రం ,అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యింది.ఇందుకోసం మూవీ టీం మొత్తం గత పది రోజుల నుండి అమెరికాలోనే మకాం వేసి ప్రొమోషన్స్ లో ఫుల్లుగా పాల్గొతుంది.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకే అత్యథిక ఓట్లు వచ్చాయని తెలుస్తుంది.అంతే ఆస్కార్ అవార్డు మనకి వచేసినట్టే అన్నమాట.ఈ ఆదివారం జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో ఈ విషయం తెలియబోతుంది.ఇప్పుడు ఎక్కడ చూసినా #RRR మూవీ పేరే వినిపిస్తూ ఉండడం తో క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ #RRR చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.

అయితే ఎదో ఊహించి రిలీజ్ చేస్తే, ఇంకేదో అనుభవం ఈ సినిమా ద్వారా ఎదురైంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటిరోజు అసలు ఓపెనింగ్ అనేదే రాలేదు.అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నప్పటికీ కూడా, షో సమయానికి కనీస స్థాయిలో అయినా ఆక్యుపెన్సీలు ఉంటాయనుకున్నారు, కానీ మొన్న గ్రాండ్ గా రీ రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ రేంజ్ లో కూడా ఈ సినిమా వసూళ్లు లేకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మొత్తం మీద మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఇకపోతే ఇదే #RRR చిత్రాన్ని వారం రోజుల క్రితం అమెరికా లో రీ రిలీజ్ చేస్తే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా వారం రోజులకు గాను రెండు లక్షల డాలర్లను రాబట్టింది తెలుస్తుంది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే #RRR చిత్రాన్ని మన తెలుగు ఆడియన్స్ కంటే ఫారిన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని.