Meenakshi Chaudhary : మోనోక్రోమ్ లుక్‌లో మిలమిల మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి

- Advertisement -

Meenakshi Chaudhary .. అదేనండి హిట్-2 సినిమాలో అడవి శేష్ కు జంటగా నటించిందిగా ఆ భామ. హిట్-2 తో ఈ బ్యూటీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుందని చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. హిట్ -2తో ఈ భామకు అవకాశాలు వరుస కడుతున్నాయి.

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

మరోవైపు మీనాక్షి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ తనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా మీనాక్షి మెస్మరైజింగ్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు కాస్త తెలుగు కుర్రాళ్ల కంటపడ్డాయి. ఇంకేం.. తెగ లైకులు కొట్టేస్తున్నారు. తెగ కామెంట్లు చేస్తున్నారు.

Meenakshi Chaudhary Photos
Meenakshi Chaudhary

తాజాగా మీనాక్షి షేర్ చేసిన  మోనో క్రోమ్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. మోనో క్రోమ్ లుక్ లోనూ మీనాక్షి మిలమిల మెరిసిపోతోంది. ఈ భామ అందానికి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ బ్యూటీ భలే ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మైకం తెప్పించే పోజులతో తమ మనసు దోచేస్తోందని అంటున్నారు.

- Advertisement -
Meenakshi Chaudhary Stills

ఇక మీనాక్షి చౌదరి మొదట మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందు నుంచే ఫొటో షూట్స్‌తో అదరగొడుతోంది. 

ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన మీనాక్షి చౌదరి.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయినా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు రాలేదు. హిట్-2 తర్వాత ఈ బ్యూటీ గురించి టాలీవుడ్ మాట్లాడుకుంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here