Poonam Kaur: పవన్ కు మెంటలెక్కే రిప్లై ఇచ్చిన పూనమ్ కౌర్…పీకే ఫ్యాన్స్ తట్టుకోలేరు

- Advertisement -

Poonam Kaur: పూనమ్ కౌర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరోయిన్ కానీ ఆమె పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె నటించిన ఒక్క మూవీ కూడా గుర్తుకు రాదు ఎందుకంటే ఆమె హీరోయిన్ యే కానీ సినిమాల్లో అస్సలు కనిపించరు కానీ వివాదాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అది కూడా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లకు రిలేటెడ్ ఉన్న అంశాల్లో ఆమె పేరు వైరల్ అవుతూ ఉంటుంది.

పూనమ్ కౌర్ అప్పుడప్పుడు పవన్, త్రివిక్రమ్ ను ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ ఉంటారు. చాల సందర్భాలలో ఆమె చేసిన కామెంట్స్ వల్ల పవన్, త్రివిక్రమ్ ఇబ్బందులు కూడా పడ్డారు. వాళ్ళ మధ్య ఎప్పుడు, ఏమి జరిగిందో వాళ్లకు తప్ప ఇంకెవరికి ఏమి తెలియదు కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ ముగ్గురు రిలేటెడ్ విషయం వైరల్ అవుతుంది.

- Advertisement -

అయితే ఇప్పుడు పూనమ్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసింది. ఒక వైసీపీ నాయకుడు ఎలోన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ… ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ పెట్టాలని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను పూనమ్ కౌర్ కోట్ చేస్తూ… ఎలోన్ మస్క్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి మరి పర్లేదా అను ట్వీట్ చేశారు. దింతో పవన్ ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నావని తిడుతున్న వైసీపీకి పూనమ్ భారీ కౌంటర్ ఇచ్చింది. ఈ కౌంటర్ తో ఆమెకు పవన్ ఫ్యాన్స్ విపరీతమైన సపోర్ట్ వస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here