‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ ట్రైలర్ రివ్యూ.. పూజ హెగ్డే ని కాపీ కొట్టేసిన హీరో నవీన్ పోలిశెట్టి!

- Advertisement -

‘భాగమతి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెర కి దూరమై చాలా కాలం అయ్యింది. ఆమె నుండి ఒక్క సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క శెట్టి హీరోయిన్ గా ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ అనే చిత్రం ప్రారంభమై చాలా కాలం అయ్యింది. నవీన్ పొలిశెట్టి ఈ చిత్రం లో హీరో గా నటించాడు. ‘జాతి రత్నాలు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేసిన సినిమా ఇదే.

మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి
మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి

గత కొంతకాలం క్రితమే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ట్రైలర్ లో అనుష్క లుక్స్ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

పదేళ్ల క్రితం అనుష్క ఎంత అందం గా ఉండేదో, ఈ సినిమాలో కూడా అంతే అందంగా ఉన్నట్టుగా అనిపించింది. అయితే ట్రైలర్ మాత్రం పెద్ద ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. కామెడీ ట్రై చేశారు కానీ ఎందుకో అది ఆశించిన స్థాయిలో పేలలేదు అని అనిపించింది. ఇక హీరో నవీన్ పొలిశెట్టి ఇందులో ‘స్టాండ్అప్ కమెడియన్’ గా కనిపించబోతున్నాడు. గతం లో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం లో హీరోయిన్ పూజా హెగ్డే ఇలాంటి పాత్రనే పోషించింది.

- Advertisement -

ఆ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు ఈ ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి‘ సినిమాలో కూడా నవీన్ పొలిశెట్టి అలాంటి క్యారక్టర్ చేసాడని అర్థం అవుతుంది . ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 7 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here