Pooja Hegde : వాటికోసం కక్కుర్తి పడి కెరీర్ ను సర్వ నాశనం చేసుకుంటున్న పూజా హెగ్ధే

- Advertisement -


Pooja Hegde : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్దే. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు చివరిగా తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించినా అది అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Pooja Hegde
Pooja Hegde

ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా పూజా హెగ్దేను అనుకోగా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూటింగ్ మొదలయ్యే సమయానికి అందులోనుంచి తప్పుకుంది. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పించారు. కేవలం రెమ్యూనరేషన్ విషయంలోనే తనను ఈ సినిమా నుంచి తొలగించారన్న వార్తలు వచ్చాయి.

pooja hegde Photos
pooja hegde

మీడియం హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు మాత్రం పూజా హెగ్డే అని హీరోయిన్ గా తమ సినిమాల్లో తీసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా తనతో వచ్చే వారికోసం ఎక్స్ ట్రాగా మరో కోటి రూపాయలు నిర్మాతలకు భారం అవుతుందన్న కారణంగానే దర్శకనిర్మాతలు ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈమెకు వచ్చిన ఛాన్స్ లన్నీ శ్రీలీల, మృణాల్ ఠాకూర్ కి మళ్లుతున్నట్లు సమాచారం. అమ్మడు రెమ్యూనరేషన్ కారణంగానే వచ్చిన అవకాశాలు పోగొట్టుకుని కెరీర్ పాడుచేసుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here