Ritika Singh : సిక్స్ ప్యాక్ బాడీతో సెక్సీ ఫోజులిస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా ‘గురూ’ !

- Advertisement -


Ritika Singh : సినీ ఇండస్ట్రీలో కథకు తగ్గట్టుగా కనిపించేందుకు హీరోలు సిక్స్ ప్యాకుల కోసం తెగ కష్టపడుతుంటారు. హీరోయిన్లకు మాత్రం ఆ అవసరం ఉండదు. వాళ్లు కూడా జిమ్ కి వెళ్లి పిట్ గా ఉంటానికి ట్రై చేస్తారు. కానీ సిక్స్ ప్యాక్ మాత్రం మెయింటైన్ చేయరు. వాళ్లకు అది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఇండస్ట్రీకి చెందిన ఓ క్రేజీ బ్యూటీ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ అందాల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఆమె టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపు అందుకుంది. కేవలం రెండు సినిమాల్లో నటించగా రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది.

Ritika Singh
Ritika Singh

ప్రొఫెషనల్ బాక్సర్ గా దాదాపు 20 మ్యాచ్లలో పార్టిసిపేట్ చేయగా 17 మ్యాచులలో విన్ అయింది. అలాంటి కథనే ఎంచుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా.. తనేనండి రితికా సింగ్. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమాలో లేడీ బాక్సర్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ రితిక సింగే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైప్ తన ప్రొఫెషనల్ బాక్సింగ్ ను కొనసాగిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేయడానికి తగ్గట్టుగా కఠినకసరత్తులు చేస్తుంది. తాజాగా తన సిక్స్ ప్యాక్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Ritika Singh Photos

కోలీవుడ్ డైరెక్టర్ సుధా కొంగ‌ర‌ డైరెక్షన్లో మాధవన్ హీరోగా నటించిన సాల ఖ‌దుర్‌ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నిజ జీవితంలో రితికా సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్. రితిక ఈ సినిమాలో తన నిజజీవిత పాత్ర పోషించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రితికకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఇదే మూవీని గురు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here