Pooja Hegde : సూసైడ్ అంటూ న్యూస్.. కోపంతో రగిలిపోయిన బుట్టబొమ్మ ఏంచేసిందంటే..

- Advertisement -

Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో కొత్తగా ఇంకేం మూవీస్ ఒప్పుకోలేదు. ఇ‍ప్పుడు ఓ క్రిటిక్‌కి లీగల్ నోటీసులు పంపితే.. ఆ విషయాన్ని అతడు కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. నేషనల్ మీడియాకు, మన లోకల్ మీడియాకు బాగా పాపులర్ అయిన క్రిటిక్ ఉమైర్ సంధు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ ని అంటూ సినిమా రివ్యూలు కొద్ది రోజులు ముందే చెప్పే అతనికి ఇక్కడ సోషల్ మీడియాలో అతనికి శత్రువులు ఉన్నారు.

Pooja Hegde
Pooja Hegde

అందుకు కారణం రివ్యూలు ఇవ్వటం ప్రక్కన పెట్టి ఎప్పటికప్పుడు ఎవరో ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ పై నోటికొచ్చి వాగుతూండటమే. అన్ని కళ్లతో చూసినట్లు అందరికి ఎఫైర్స్ అంటగడుతూంటాడు.ఎప్పుడూ ఎవరో ఒకరిని సెలబ్రిటీలను టార్గెట్ చేయడం వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడు పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.పూజా గత రెండు వారాలుగా తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెల్లిపోయిందని.. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఉమైర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆమెను కాపాడాకలిగారని ఉమైర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో పూజా హెగ్డే టీమ్ అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని మురిసి పోతున్నాడు ఉమైర్. అంటే తనను ఎవరూ ఏమీ చేయగలరు అన్నట్లు ఉంది అతని ధోరణి. వేరే దేశంలో ఉండి ఇలా ట్వీట్స్ చేస్తూ ..లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి. ఇంతకు ముందు…హీరో అక్కినేని అఖిల్, ఊర్వశి రౌతేలా ను హెరాస్ చేశాడని ఆమెను ఇబ్బంది పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు ఉమైర్.ఉమైర్ సంధు ఓ ట్వీట్ లో.. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here