Pooja Hegde : ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బుట్టబొమ్మ పూజాహెగ్డే (pooja hegde). ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో పద్దతిగా కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ డీజే సినిమాలో ఏకంగా బికినీ వేసుకొని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత గ్లామర్ పాత్రలతో మెప్పించింది ఈ చిన్నది. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది పూజ. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ సైతం అతిథి పాత్ర పోషిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే సల్మాన్ తో సినిమా మొదలైనప్పటి నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజా స్పందించింది.
తాజాగా పూజా హెగ్డే..ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై ఓపెన్ అయింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉంటున్నాను. ఎవరితో డేటింగ్ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం సినిమాలతో ఒక నగరం నుంచి మరో నగరానికి తీరిక లేకుండా తిరుగుతున్నాను. తన కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం సరిపోవడం లేదు. అలాంటిది వేరేకొరితో డేటింగ్ చేసే తీరికా, ఓపిక నాకు అస్సలు లేదంటూ కుండ బద్ధలు కొట్టింది. ఇక ఈమె నటించిన ‘కిసీ కా భాయి కిసీ జాన్’ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.