పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే. వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ గా ఎదిగింది. నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత వరుణ్ తేజ్ మొట్టమొదటి చిత్రం ‘ముకుంద’ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఆమెకి బాలీవుడ్ లో ఏకంగా హృతిక్ రోషన్ సరసన ‘మోహెన్ జోడారో’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథమ్’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ స్టార్ హీరోల సరసన నటించిన హిట్లు , సూపర్ హిట్లు మరియు నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్లు దక్కాయి. ఈమె కెరీర్ లో బాగా క్లోజ్ అయిన స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కళ్ళు మూసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పేయొచ్చు.సోషల్ మీడియా వాడే ప్రతీ ఒక్కరికి వీళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే విషయం చెప్పేయగలరు.అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఇచ్చే సూచనల వల్లే పూజ హెగ్డే కెరీర్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అని పిలవబడే పూజ హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమె కోసం సెట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ వల్లే అట.ఆమె రీసెంట్ గా ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఆయన సెట్ చేసినవే అట. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబు తో తీస్తున్న ‘గుంటూరు కారం‘ చిత్రం లో కూడా పూజ హెగ్డే ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా తో ఆమె బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.
