Pongal movies : పాంచ్ పటాకా.. ఈ సంక్రాంతికి మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు..?

- Advertisement -

Pongal movies : ఈ ఏడాది సంక్రాంతి సందడి మామూలుగా లేదు. నలుగు స్టార్ హీరోస్.. అది కూడా టాలీవుడ్ , కోలీవుడ్ హీరోలు.. కలిసి వస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్లపై ఇప్పటి దాకా ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు.. ఒక రోజు గ్యాప్ తో వస్తుండగా.. తమిళ్ స్టార్స్ అజిత్, విజయ్ లు ఒకేసారి వస్తున్నారు. నాలుగు పెద్ద సినిమాలతోపాటు ఓ చిన్న చిత్రం పొంగల్‌కు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమమైంది. మరి ఈ పొంగల్ పాంచ్ పటాకాలో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు..?

Pongal movies
Pongal movies

ఈ ఏడాది థియేటర్లలో సంక్రాంతి సందడి ఫస్ట్ తమిళ్ హీరోలతోనే షురూ కానుంది.  అజిత్‌ నటించిన ‘తునివు’ (తెలుగులో తెగింపు) జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇళయదళపతి విజయ్‌  హీరోగా రూపొందిన ‘వారిసు’ (తెలుగులో వారసుడు)ను జనవరి 12న రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించిన మూవీ టీమ్‌ అనూహ్యంగా జనవరి 11ని ఫైనల్‌ చేసింది. ఇలా పదోసారి అజిత్, విజయ్ సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి. 

తెగింపు: అజిత్‌ హీరోగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కించిన చిత్రమిది. బ్యాంకు దోపిడీ కథాంశంతో యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. క్రిమినల్స్‌- పొలిటిషియన్స్‌- పోలీస్‌ ఆఫీసర్స్‌ చుట్టూ తిరిగే ఈ స్టోరీలో పోరాట సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఎందుకు హీరో దోపిడీ చేయాల్సి వచ్చింది? వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? ఎవరికైనా సాయం చేసేందుకా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మంజూ వారియర్‌ కథానాయికగా నటించిన ఈ ‘తెగింపు’ ట్రైలర్‌ న్యూ ఇయర్‌ కానుకగా విడుదలై అలరిస్తోంది. 

- Advertisement -
Thegimpu
Thegimpu

వారసుడు: విజయ్‌ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. పూర్తిస్థాయి కుటుంబ కథగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్‌కూ చోటుంది. అన్నదమ్ములు చేసే అల్లరి.. వారి మధ్య ఉండే ఆప్యాయతల కలబోతగా, కుటుంబమే అన్నింటికంటే ముఖ్యం అని గుర్తుచేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. ఇందులో విజయ్‌, టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, కిక్‌ శ్యామ్‌ సోదరులుగా కనిపిస్తారు. జీవితంలో ప్రతిదాన్నీ తేలికగా తీసుకునే హీరో తన కుటుంబానికి కష్టం వస్తే ఏం చేశాడు? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. విజయ్‌ నటించిన తొలి ద్విభాషా (ఏక కాలంలో తెలుగు, తమిళ్‌లో చిత్రీకరించడం) సినిమాకావడంతో ‘వారసుడు’పై అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.

Varasudu
Varasudu

ఒక్కరోజు తేడాతో బాలయ్య, చిరు

సంక్రాంతి పోరులో చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడటం ఇది పదోసారి. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న విడుదలకానున్నాయి. ‘క్రాక్‌’ వంటి హిట్‌ తర్వాత గోపీచంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంకావడం, బ్లాక్‌ బస్టర్‌ ‘అఖండ’ తర్వాత బాలయ్య నటించిన సినిమాకావడంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు తార స్థాయికి చేరాయి. 

చిరంజీవి హీరోగా.. ఆయన్ను బాగా అభిమానించే దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 90ల్లో చిరంజీవి ఎలా కనిపించారో అలాంటి లుక్‌లోనే (వింటేజ్‌) ఈ సినిమాలోనూ కనిపిస్తారనే విషయం తెలియడమే ఆలస్యం అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. టైటిల్‌ టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో హీరో రవితేజ కీలక పాత్ర పోషించడం ప్రధాన ఆకర్షణ. మత్స్యకారుల నాయకుడిగా చిరు, పోలీసు అధికారిగా రవితేజ నటించారు. కేథరిన్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రధారులు.

అగ్ర హీరోల మధ్య చిన్న సినిమా.. ముగ్గుల పండక్కి అగ్ర తారల చిత్రాలు ఎన్ని పోటీ పడినా వాటి మధ్య ఓ చిన్న సినిమా కూడా ఖాయంగా సందడి చేస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో నిలిచింది ‘కల్యాణం కమనీయం’. సంతోష్‌ శోభన్‌, ప్రియాభవానీ శంకర్‌ జంటగా అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించిన చిత్రమిది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com