Baby Movie : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ బేబీ మూవీ స్టోరీ నాదే అంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బేబీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రూపొందించినా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఈ కథను దర్శకుడు సాయి రాజేష్‌కి కొన్నేళ్ల క్రితమే చెప్పాను అని శిరీన్ శ్రీరామ్ ఇటీవల వివరించింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2013లో దర్శకుడు సాయి రాజేష్ షిరిన్ శ్రీరామ్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పని చేయమని అడిగాడు. తనతో పరిచయం ఏర్పడిందని చెప్పిన శ్రీరామ్.. 2015లో ‘కన్న ప్లీజ్’ అనే టైటిల్ తో కథ రాసుకున్నట్లు పోలీసులకు వివరించాడు.

ఈ కథకు ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టినట్లు దర్శకుడు సాయి రాజేష్ సూచనలతో నిర్మాత ఎస్‌కెఎన్‌కి శ్రీరామ్ వివరించారు. ఇదే కథ కొన్నాళ్ల తర్వాత 2023లో బేబీ అనే టైటిల్ తో సాయి రాజేష్ దర్శకుడిగా ఎస్కేఎన్, ధీరజ్ నిర్మాతలుగా చిత్రాన్ని తెరకెక్కించారు. బేబీ కథ మొత్తం తన ప్రేమించొద్దు కథ అని శిరీన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.