సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. దివంగత నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తాజాగా మహేశ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మీడియాతో మాట్లాడారు.
అలాగే మహేశ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయని.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. మహేశ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని.. ఎవరినైనా, ఏ వాయిస్ అయినా మిమిక్రీ చేయగలడని చెప్పారు. అయితే మహేశ్ గురించి చాలా మందికి తెలియని మరో విషయమేమిటంటే.. 14 ఏళ్ల వయసులోనే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపేవాడట మహేష్. అలాంటి సమయంలో ఓ సారి పోలీసులు దొరికిపోయాడట మహేష్. లైసెన్స్ కోసం మహేష్‌ను కారు ఆపమని పోలీసులు చెప్పారట. కానీ మహేష్ కారు ఆపకుండా డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేశాడు. దాంతో పోలీసులు మహేష్ వెంట పడ్డారని.. కానీ వాళ్లను తప్పించుకునేందుకు ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చున్నారని చెప్పారు.
ఇక నటనలోనూ ఎంతో టాలెంట్ ఉంది. ప్రతి భావోద్వేగాన్ని చక్కగా పండించగలడు. అమితాబ్ బచ్చన్‌కు ఉన్నంత ప్రతిభ ఉంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సమయంలోనే మహేశ్ పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నాం. ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. మొదట్లో కంటే ఇప్పుడు డ్యాన్స్‌లోనూ అదరగొడుతున్నాడు. చిన్పప్పుడు బాగా అల్లరి చేసేవాడు.. అని ఆదిశేషగిరి రావు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు, మాటల మాంత్రికు త్రివిక్రమ్ కలిసి.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు..మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ కారణంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు.