Game Changer : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం గత రెండు సంవత్సరాల నుండి తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటుగా, ఇతర హీరోల అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కానీ రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ‘జరగండి..జరగండి’ అనే పాట సోషల్ మీడియా లో లీక్ అయ్యి పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటపై అభిమానుల రియాక్షన్స్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే నిర్మాత దిల్ రాజు మాత్రం లీక్ చేసిన వ్యక్తులపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. లీక్ చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తామని, అలాగే సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వారిపై కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

చెప్పినట్టుగానే సైబరాబాద్ లో కేసు ని నమోదు చేసిన దిల్ రాజు, సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత కాసేపటి క్రితమే నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఏసీపీ చాంద్ బాషా కాసేపటి క్రితమే మీడియా కి తెలియచేసాడు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు, అత్యుత్సాహం తో ఇలా కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులో పైరసీ చెయ్యాలంటే వణుకు పుట్టేలా చేస్తామని ఏసీపీ చాంద్ బాషా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఈ పాటని అధికారికంగా దీపావళి కానుకగా విడుదల చెయ్యబోతున్నారు.

దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పోస్టర్ తో వారం క్రితమే ప్రకటన చేసింది మూవీ టీమ్. రేపు లేదా ఎల్లుండి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ తో ఈ పాటకి సంబంధించిన టైం ని చెప్తారని అంటున్నారు. #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ లాంటి దర్శకుడితో చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఊహించని రేంజ్ లో ఉన్నాయి. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.