‘గబ్బర్ సింగ్’ చిత్రానికి 11 ఏళ్ళు.. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మార్పులు లెకపొయ్యుంటే ఫ్లాప్ అయ్యేదా..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఇది కేవలం సినిమా కాదు, ఫ్యాన్స్ ఎమోషన్స్. ఎన్నో సంవత్సరాల నుండి తాము ఆరాధ్యం గా భావించే హీరో నుండి సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఏకంగా ఇండస్ట్రీ హిట్ రేంజ్ బొమ్మ పడింది.ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆట చూసిన ఫ్యాన్స్ అదృష్టవంతులు అని అంటుంటారు.

గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్

టీజర్ దగ్గర నుండే అంచనాలను పెంచేసిన ఈ సినిమా, మొదటి రోజు నుండి ఫుల్ రన్ వరకు రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టించింది.ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అభిమానులు ఎంతో కంగారు పడ్డారు. ఎందుకంటే ఇది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్.ఈ సినిమా మొత్తం సల్మాన్ ఖాన్ స్టైల్ లో ఉంది, స్టోరీ పెద్దగా లేదు, ఇలాంటి సినిమాని రీమేక్ చేస్తే డిజాస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు.

కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన కొన్ని కీలకమైన ఇన్ పుట్స్ హరీష్ శంకర్ తూచా తప్పకుండ ఫాలో అవ్వడం వల్లే, ఈ సినిమా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ , పోలీస్ స్టేషన్ సీన్స్ మరియు అంత్యాక్షరి సీన్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఐడియాలు అట. ముఖ్యంగా ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ రావడానికి కారణం అంత్యాక్షరి ఎపిసోడ్.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ఐడియా ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యింది.సుమారుగా దశాబ్దం పాటు ఈ అంత్యాక్షరి సన్నివేశం ఫార్ములా ని ప్రతీ సినిమాలో వాడుతూ వచ్చే వారు మేకర్స్.ఈ సన్నివేశాలు పెట్టి ఉండక పోయి ఉంటే ‘గబ్బర్ సింగ్‘ చిత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేది కాదని అంటున్నారు విశ్లేషకులు.నేడు ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు అయ్యింది.ఈ సందర్భంగా మళ్ళీ పవన్ – హరీష్ కాంబినేషన్ లో వస్తున్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతుంది వీడియో టీం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here