పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారంటే ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే పవర్ స్టార్ మెగా హీరోలతో నటిస్తున్నారంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు. అందుకే పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి అంత క్రేజ్. రియల్ లైఫ్‌లో చాలా క్లోజ్‌గా ఉండే ఈ మావాఅల్లుళ్లు రీల్ లైఫ్‌లో ఎలా ఉంటారో చూడాలని అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఎలా ఉంటుందని చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాకు పెట్టిన టైటిల్ చూసి తెగ ఫైర్ అయిపోతున్నారు. ఇదేం టైటిల్ రా బాబు అంటూ డీలా పడిపోతున్నారు. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా..?
తమిళ్లో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ జులై 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవనుంది. రిలీజ్‌కు సరిగ్గా 3 నెలల సమయం కూడా లేదు.. కానీ ఇప్పటికీ టైటిల్ ఖరారు చేయలేదని ఫ్యాన్స్ తెగ ఫైర్ అయిపోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ‘దేవుడే దిగి వచ్చినా’, ‘దేవర’ అనే టైటిల్ పెడతారనే ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు బ్రో అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఈ టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ టైటిల్‌పై ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్.. అటు సుప్రీం హీరో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారట. రియల్ లైఫ్‌లో మావా అల్లుళ్లు.. రీల్ లైఫ్‌లో బ్రోస్ గా నటించడం తమకేం నచ్చలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. పవర్ స్టార్‌కు ఉన్న క్రేజ్.. మాస్ ఫాలోయింగ్‌కు ఇలాంటి టైటిల్ ఏం బాగోదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫాంటసీ డ్రామా సినిమాకు పవన్ కల్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు సమాచారం.
అనుకోకుండా ప్రమాదంలో కన్నుమూసిన ఓ వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే పాయింట్‌తో ఈ రీమేక్ కథ సాగనున్నట్లు టాక్. వినోదయ సీతమ్ రీమేక్‌కు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాషణలను అందించబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్లో ఎలాంటి పాటలు లేవు కానీ తెలుగు స్క్రిప్ట్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసేలా ఓ మాస్ మసాలా నెంబర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. తెలుగు వర్షన్ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.