Kamal Haasan : బెజవాడ నడిరోడ్డు లో కమల్ హాసన్ పై దాడి చేసిన జనాలు..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Kamal Haasan : ‘విక్రమ్’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ శంకర్ తో ‘ఇండియన్ 2 ‘ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో మధ్యలో ఆగిపోయిన ఈ సినిమాని, శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు. ఒక నెలకి 15 రోజులు ఇండియన్ 2 కి పని చేస్తే, మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి పని చేసాడు.

Kamal Haasan
Kamal Haasan

‘గేమ్ చేంజర్’ సినిమా ఎక్కువ శాతం మన ఆంధ్ర ప్రదేశ్ పరిసరాల్లోనే షూటింగ్ ని చేసారు. ఇక్కడి లొకేషన్స్ శంకర్ గారికి బాగా నచ్చినట్టు ఉన్నాయి. అందుకే ఇండియన్ 2 లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను విజయవాడ ప్రాంతం లో చిత్రీకరిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Indian 2

‘గేమ్ చేంజర్’ చిత్రానికి నిర్మాత దిల్ రాజు కాబట్టి, ఆయన ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చెయ్యడానికి ఇష్టపడ్డాడు అని అనుకుందాం. కానీ ‘ఇండియన్ 2 ‘ చిత్రానికి తమిళ ప్రొడ్యూసర్స్. అయినప్పటికీ కూడా విజయవాడ లో షూటింగ్ చెయ్యడానికి ఇష్టపడ్డారు అంటే, కచ్చితంగా అది శంకర్ కి ఉన్న ప్రత్యేకమైన ఆసక్తి అనే చెప్పొచ్చు. అయితే నిన్న విజయవాడ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను కమల్ హాసన్ పై చిత్రీకరించారు.

- Advertisement -
SHankar Indian 2

ఆయనపై జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దాడికి సిద్ధం అయ్యినట్టుగా ఈ షాట్ ని తెరకెక్కించారు. మన ఆంధ్ర లో షూటింగ్ అంటే లీకుల సమస్య కచ్చితంగా ఉంటుంది. ‘గేమ్ చేంజర్‘ మూవీ షూటింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో వచ్చాయి. అలాగే ఇండియన్ 2 షూటింగ్ కి సంబంధించిన వీడియో కూడా ఒకటి లీక్ అయ్యింది. ఆ వీడియో ని మీరే చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here