Payal Rajput : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో యువతకు షాకిచ్చింది.. ఆ తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అవుతూ వస్తుంది.. అయితే ఈ అమ్మడు అజయ్ భూపతి తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టారు.. ఆ సినిమాకు మంగళవారం అనే టైటిల్ ను పెట్టారు.. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు..

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. సినిమా లో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. హీరోయిన్ గా తెలుగులో పాయల్ రాజ్‌పుత్ తొలి చిత్రమది. ఆ తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కలయికలో వస్తున్న చిత్రమిది. ‘మంగళవారం’ లో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు నేడు. ఆ లుక్ చూస్తే… పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు.

ఇక దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్. మూవీలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది’ అని అన్నారు… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ . ఎం, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..
The LOOK says a lot if you can see 🔥🦋
— paayal rajput (@starlingpayal) April 25, 2023
Presenting Feisty and Beautiful @starlingpayal as 'Shailaja' from #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/wPDs3rC5AO