Payal Rajput : ప్రభాస్ తో పెళ్లి గురించి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Payal Rajput : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి నెగటివ్ రోల్ ద్వారా అడుగుపెట్టింది. తొలిసినిమా తోనే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హాట్ బ్యూటీ, అదే తరహా బోల్డ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కానీ ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ హీరోయిన్ కి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలు లేవు. అలాంటి సమయం లో గత ఏడాది ఈమె హీరోయిన్ గా నటించిన ‘మంగళవారం’ చిత్రం విడుదలై మంచి హిట్ అయ్యింది. దీంతో పాయల్ రాజ్ పుత్ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది.

Payal Rajput
Payal Rajput

ఇది కాసేపు పక్కన పెడితే గత కొద్దిరోజుల క్రితం పాయల్ రాజ్ పుత్ కి రెబెల్ స్టార్ ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ పెను దుమారం రేపింది. రీసెంట్ గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ ని ఒక విలేఖరి కాసేపటి వరకు ఇంటర్వ్యూ చేస్తూ ‘మీపై సోషల్ మీడియా ద్వారా విన్న ఫన్నీ రూమర్ ఏదైనా ఉందా’ అని ఆమెని అడగగా, దానికి పాయల్ రాజ్ పుత్ సమాధానం ఇస్తూ ‘ఇటీవలే నాకు ప్రభాస్ తో పెళ్లి అయ్యింది అంటూ ఒక రూమర్ వచ్చింది. ఈ రూమర్ విని ఫుల్లుగా నవ్వుకున్నాను. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో, అది నిజమైతే బాగుండును అని కూడా అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

DC Exclusive: Pranadeep was rude, used foul language: Payal Rajput's team

- Advertisement -

పాయల్ రాజ్ పుత్ మొదటి నుండి ప్రభాస్ కి వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే. అనేక సందర్భాలలో అనేక ఇంటర్వూస్ లో ఈమె ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది. ప్రభాస్ చిత్రం విడుదలైనప్పుడు థియేటర్స్ కి వెళ్లి అక్కడ ప్రభాస్ పోస్టర్స్ కి ముద్దు పెడుతూ సెల్ఫీ కూడా తీసుకున్న సందర్భాలను ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్నోసార్లు పంచుకుంది. అందుకే ప్రభాస్ తో పెళ్లి అనే రూమర్స్ ని ఆమె అంతలా ఎంజాయ్ చేస్తుంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here