Payal Rajput : నేటి తరం హీరోయిన్స్ లో అందంతో పాటు, నటనలో కూడా అద్భుతంగా రాణించే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ కచ్చితంగా ఉంటుంది. ఆర్ ఎక్స్ 100 చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ చిత్రం నుండి మొన్న విడుదలైన మంగళవారం చిత్రం వరకు కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వచ్చింది. నెగటివ్ రోల్ తో వెండితెర అరంగేట్రం చేసినప్పటికీ కూడా, ఆ ఇమేజి నుండి బయటకి వచ్చి హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగు లో ఒక్క సినిమా, తమిళం లో రెండు సినిమాలు చేస్తుంది. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది.
ఈమె అప్లోడ్ చేసే హాట్ ఫోటోలు, వీడియోలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూంటాది. లేటెస్ట్ గా సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ అవుతున్న ‘తౌబా తౌబా’ సాంగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది పాయల్. ఈ వీడియో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ మొత్తం ట్రెండ్ అవుతూ ఉంది. పింక్ కలర్ లో ఉన్న పొట్టి దుస్తులను ధరించి ఆమె వేస్తున్న చిందులు కుర్రాళ్ళ మతులను పోగొట్టేసింది. కొంతమంది కామెంట్స్ లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఇంత అందమైన అమ్మాయికి అవకాశం ఇవ్వకుండా, ఎవరెవరికో ఎందుకు ఇస్తారని, పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన అమ్మాయి అని, ఇప్పటికైనా ఆమెని స్టార్ హీరోలు ప్రోత్సహించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే పాయల్ రాజ్ పుత్ కాంతారా ప్రీక్వెల్ కి సంబంధించిన ఆడిషన్స్ కి ఆ చిత్ర బృందం ఒక ప్రమోషన్ ట్వీట్ వేస్తే, దయచేసి నన్ను మీ సినిమాలో తీసుకోండి, నేను ఆర్ ఎక్స్ 100 , మంగళవారం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేశాను. నా నటన మీకు కచ్చితంగా నచ్చుతుంది, దయచేసి చూడండి అంటూ ఆమె రిప్లై గా పెట్టిన ట్వీట్లు అప్పట్లో ఎంత ట్రెండ్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇంత అందం, టాలెంట్ ఉన్న అమ్మాయి ఇలా అడగడం ఏంటి అని చాలామంది బాధపడ్డారు కూడా, భవిష్యత్తులో అయిన పాయల్ రాజ్ పుత్ కి టాలెంట్ కి తగ్గ స్టార్ స్టేటస్ దక్కుతుందో లేదో చూడాలి.
View this post on Instagram