పూనమ్ కౌర్ పోస్ట్ తో వివాదంలో పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. వైరల్..

- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నటి పూనమ్ కౌర్ ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ అంటే పూనమ్ కు ఇష్టమో లేదా కోపమో తెలియదు కానీ వరుస ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి పూనమ్ కౌర్ పవన్ నటిస్తున్న చిత్రాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మ్యానియాతో ఊగిపోతున్నారు..

పూనమ్ కౌర్
పూనమ్ కౌర్

డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో దాదాపు 10 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నేడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి సంధ్య థియేటర్స్ లో ప్రదర్శించారు.. విడుదలైన కొద్ది నిమిషాలకే వ్యూస్ తో దూసుకుపోతుంది.. గత కొద్ది నిమిషాల నుంచి ఈ సినిమా వరుస పోస్టులు పెడుతూ వీడియో పై భారీగా అంచనాలను క్రియేట్ చేశారు.. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పూనమ్ కౌర్ ఈ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ కాళ్ళని చూపిస్తున్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. దీనిపై పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది..

పవన్ కళ్యాణ్ పాదాల కింద ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ ఉంది. దీనితో ఇది స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ని కించపరచడమే అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర యోధుడి పేరుని కాళ్ళ కింద పెట్టడం ఏంటి.. ఇది కించపరచడం కదా అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇది అహంకార పూరితమైన చర్య అంటూ పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసింది..

- Advertisement -

అంతేకాదు ఇందర్వాన్ష్ సింగ్ అనే సోషల్ యాక్టివిస్ట్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై మండిపడ్డారు. కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నాం అని ట్వీట్ చేశారు..మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. పోస్టర్ ని మార్చుతారా లేక విమర్శలపై స్పందిస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ హంగామా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఉంది.. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ మ్యూజిక్ ను అందిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here