Keerthi Reddy : పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.!?

pavan toliprema movie heroine keerthi reddy present details


Keerthi Reddy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలలో తొలిప్రేమ కూడా ఒకటి.. తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించిన నందిని రెడ్డి అప్పట్లో కుర్రకారు గుండెల్లో పదిలంగా నిలిచిపోయింది.. ఈ సినిమాలో ఆమె ఎంట్రీ సీన్ మరో అద్భుతం.. చిచ్చు బుడ్డి వెలుగుల్లో ఆమె అందమైన రూపం చూస్తూ ఇప్పటికీ పరవశించిపోతారు సినీ ప్రేక్షకులు.. ఇంతకీ ఆ నందిని రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుంది.!!? ఇక్కడ ఉందో తెలుకుందామా.!?

keerthi reddy
keerthi reddy

పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాగా తొలిప్రేమ టాలీవుడ్ రికార్డులలో నిలిచిపోయింది.. కీర్తి రెడ్డి ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవడంతో.. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లు కట్టాయి ఈ అమ్మడుకి.. ఆ తర్వాత వడ్డే నవీన్ హీరోగా వచ్చిన ప్రేమించే అనే సినిమాలో నటించింది.. మహేష్ బాబు అర్జున్ సినిమాలో మహేష్ కి అక్కగా నటించింది.

ఆ తర్వాత కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన రావోయి చందమామ అనే సినిమాలో నాగార్జున కి మరదలు పాత్రలో కీర్తి రెడ్డి నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది..

keerthi reddy photos

బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ రాకపోవడంతో.. హీరో సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 2004లో వీరిద్దరి పెళ్లి జరిగింది.. కానీ వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు.. 2006లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి సినీ ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయింది..

సుమంత్ తో విడాకుల తర్వాత ఆమె ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయింది. కీర్తి రెడ్డికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన కెరియర్ విషయం పక్కన పడితే .. వైవాహిక జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నానని కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక పిల్లల బాగోగులను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటుంది. కీర్తి రెడ్డి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. కానీ ఆమె ఫ్యాన్స్ మళ్లీ ఆమె సినిమాల్లో రీఎంట్రీ ఇస్తే చూడాలని కోరుకుంటున్నారు.