Anjali Lavenia : సినిమాల్లో అవకాశాలు లేక పబ్బులో పని చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

టాలీవుడ్ లో హీరోల మద్యకంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ మధ్యనే పోటీ విపరీతంగా ఉంటుంది. అందం మరియు అభినయం ఉంటే సరిపోదు, ప్రతీ ఏడాది ఇండస్ట్రీ లోకి వచ్చే కొత్త హీరోయిన్స్ ని తట్టుకొని నిలబడాలంటే కచ్చితంగా అదృష్టం మరియు విజయాలు కూడా ఉండాలి. ఆ రెండు లేకపోతే ఎవ్వరూ విలువ కూడా ఇవ్వరు. పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘పంజా’ మూవీ సెకండ్ హీరోయిన్ అంజలి లవేనియా.

Anjali Lavenia
Anjali Lavenia

ఈమె ఈ ఒక్క సినిమాలో కనిపించింది, ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయింది. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ రోల్ రావడం అంటే అదృష్టం, అలాంటి అదృష్టాన్ని మొదటి సినిమాతోనే దక్కించుకున్న అంజలి లవేనియా ని చూసిన ప్రతీ ఒక్కరు ఈ అమ్మాయి చాలా హాట్ గా ఉంది, కచ్చితంగా భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. పంజా సినిమా హిట్ అయ్యుంటే నిజంగానే ఈమె స్టార్ హీరోయిన్ అయ్యేదేమో, కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఆ సినిమా ఫలితం తర్వాత మళ్లీ అంజలి లువానియా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఆమెకి సినిమాల మీద ఆసక్తి లేక ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయిందో, ఎవరికీ తెలియదు. అయితే ఈమె సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ వీడియోలను మరియు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. అయితే రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన ఒక వీడియో ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు.

- Advertisement -

ఒక పెద్ద పబ్ లో ఆమె అక్కడ ఉన్నటువంటి తోటి మ్యూజిషియన్స్ తో కలిసి మ్యూజిక్ ని ప్లే చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడకి వచ్చిన కస్టమర్స్ కోసం వాళ్లకి ఆహ్లాదం కలిగించే విధంగా ఈమె మ్యూజిక్ ని ప్లే చెయ్యడం, కస్టమర్స్ మొత్తం డ్యాన్స్ చెయ్యడం వంటివి మనం క్రింద చూడవచ్చు. అంత మంచి అందమైన హీరోయిన్ పెద్ద టాప్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే ఇలా అయ్యిందే అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here