Actor Ali అలాంటి పనులు కూడా చేస్తున్నాడా?.. వింటే దండం పెడతారు..

- Advertisement -

Actor Ali గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. ఆయన సినిమాల్లో ఎంత ఫిమేస్సో, బయట కూడా అంత మంచి మనిషి సాయం కోరిన వారికి లేదనకుండా తోచిన సాయాన్ని చేస్తున్నారు..ఇకపోతే ఇప్పుడు ఆలీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆయన పేద పిల్లలను అక్కున చేర్చుకొని తనవంతు సహకారం అందిస్తున్నారని టాక్..తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకు ఆస్ట్రేలియాకి చెందిన అర్వేన్సిస్‌ కంపెనీ నిర్వహకులను ఇండియాకి తీసుకొచ్చారు. అంతేకాదు ఆ కంపెనీకి తాజాగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అలీ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో దీనికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Actor Ali
Actor Ali

అయితే, అలీ మాట్లాడుతూ.. గతేడాది ఓ కార్యక్రమం కోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఒకేమాట మీద ఉంటూ ఎంతోమందికి సాయం చేయటం నా కళ్లారా చూశాను. ఆ రోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి అడిగాను. మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడిగాను. శశిగారు, విష్ణు జగ్గిరెడ్డి గారు కలుద్దాం అలీగారు అన్నారు. నేను ఇద్దరో ముగ్గురో వస్తారని అనుకున్నాను. దాదాపు 60మందికి పైగా వచ్చి ఎలా సాయం చేయాలి అని అడిగారు. దానికి వెంటనే ఒకే అని చెప్పారట..ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ సందర్బంగా.. ఆర్వేన్సిస్‌ సీఈవో డైరెక్టర్‌ శశిధర్‌ కొలికొండ మాట్లాడుతూ, హైదరాబాద్‌ నుండి ఆస్ట్రేలియా సిటిజన్‌ అయ్యి అక్కడినుండి మా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తున్నాను. అలీ కలసిన తర్వాత నా మైండ్‌సెట్‌ అంతా మారిపోయింది. అందుకే మేము ఆస్ట్రేలియాలో చేసే సేవలను ఇండియాలో చేయాలి అని నిర్ణయించుకుని చాలా పెద్ద ఎత్తున మనవాళ్లకు విద్య – వైద్య – టెక్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలని మా టీమంతా కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. అందుకే మా టీమంతా కలిసి వైజాగ్‌లో మార్చి 3-4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు హాజరవుతున్నాం` అని చెప్పారు.. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట అవుతుండటం తో ఆలీ పై జనాలు ప్రశంసలు కురిపిస్తూన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here