Guntur Kaaram : ఈమధ్య కాలం లో సినిమాల్లో రాజకీయ నాయకుల పై సెటైర్లు వెయ్యడం చాలా కామన్ అయిపోతుంది. అధికార పక్షం పార్టీ వైపు మొగ్గు చూపుతూ, వాళ్లకి ఎవరిని తిడితే మన సినిమాకి ప్లస్ అవుతుందో గమనించి, ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు డైరెక్టర్స్. దానిని స్టార్ హీరోలు సైతం అంగీకరించి సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘గుంటూరు కారం’ చిత్రం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై సెటైర్లు విసురుతూ త్రివిక్రమ్ ప్లాన్ చేశాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అభిమానుల్లో.

ఎందుకంటే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో లో ఒక వ్యక్తి గెడ్డం వేసుకొని, మేడలో ‘జన దేశం పార్టీ’ పార్టీ అనే కండువా వేసుకొని మహేష్ పక్కన నిల్చుంటాడు. అతని వేషధారణ మొత్తం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ప్రచారం లో ఉన్న విధంగా ఉంది.

అంతే కాదు, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ పేరు ‘జన దేశం పార్టీ’. ఈ పేరు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..?. బాగా పరిశీలిస్తే జనసేన పార్టీ, అలాగే తెలుగు దేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. జనసేన నుండి ‘జన’, తెలుగు దేశం నుండి ‘దేశం’ పదాలను తీసుకొని ‘జనదేశం’ అనే పేరు ని పెట్టారని. హీరో మహేష్ బాబు ఈ పార్టీ చేసే పెత్తనం పై పోరాడుతూ ఉంటాడని తెలుస్తుంది. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు పై సెటైర్లు ఈ సినిమాలో పుష్కలంగా పెట్టినట్టు అర్థం అవుతుంది.

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు, స్నేహితుడు అయినా కూడా జనసేన పై సెటైర్లు వేస్తూ సినిమా తీసాడా అంటే నమ్మశక్యంగా లేదు. అలా తీసాడు కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘సలార్’ చిత్రానికి కూడా ఇవ్వని రేంజ్ లో ‘గుంటూరు కారం’ కి టికెట్ రేట్స్ ఇచ్చారని అనుకుంటున్నారు.
