Ruhani Sharma : ఏంటీ ఆ హీరోయిన్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందా.. సీక్రెట్ చెప్తే సిగ్గుపడిపోయింది

- Advertisement -


Ruhani Sharma : ప్రస్తుతం ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రుహానీ శర్మ . ఆమె విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట.. అందుకు అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఓ తమిళ సినిమాతో సినీ పరిశ్రమంలోకి వచ్చి ఆ తర్వాత తెలుగులో సుశాంత్ తో కలిసి చి.ల.సౌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది రుహానీ శర్మ. ఫస్ట్ సినిమాతోనే ఫర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎంచుకుని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Ruhani Sharma
Ruhani Sharma

ఆ తర్వాత పలు భాషలలో సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు దక్కలేదు తనకు. ప్రజెంట్ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. సంక్రాంతి కానుకగా వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాలో రుహాని శర్మ డాక్టర్ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఇటీవల ఓ షాప్ ఓపెనింగ్ కి వచ్చిన రుహానీ శర్మ తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంది.

Kohli

అంతేకాదు ఈ క్రమంలోనే మీడియా వాళ్లు ఆమెను అడిగిన ప్రశ్నలకు షాక్ అయిపోయింది . మీరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సిస్టర్ అవుతారట..?.. అంటే విరాట్ కోహ్లీకి మరదలు ? అని అనగానే మీకెలా తెలుసు ఇది చాలా సీక్రెట్.. ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు” అంటూ ఆశ్చర్యపోయింది. అంతేకాదు నిజమే.. అనుష్క నాకు సిస్టర్ అవుతుంది.. విరాట్ కోహ్లీ నాకు బావ వరుస అవుతాడు.. తాను చాలా మంచోడు నాతో బాగా మాట్లాడుతాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా మంచోళ్లు.. ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు ” అంటూ విరాట్ అనుష్కలను తెగ పొగిడేసింది ఈ భామ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here