Pawan Kalyan : #OG ఫస్ట్ లుక్ ఇదే.. థియేటర్స్ అల్లకల్లోల్లం అయిపోతాది!

- Advertisement -

Pawan Kalyan : ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘#OG’. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా మూడు నెలల నుండి సాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నెల రోజులపాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆయన ‘వారాహి విజయ యాత్ర’ తో బిజీ అవ్వడం వల్ల ఆయన లేని షూటింగ్ పార్ట్ ని ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఈ సినిమాకి ఉన్నటువంటి హైప్, క్రేజ్ టాలీవుడ్ లో ప్రస్తుతానికి ఏ సినిమా మీద లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం నుండి ఏదైనా ఫోటో వచ్చిన, మేకింగ్ స్టిల్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం ఆగిపోతాది. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఈ చిత్రం నుండి ఒక వర్కింగ్ స్టిల్ బయటకి వచ్చింది.

ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ చేతిలో కత్తి పట్టుకొని మార్షల్ ఆర్ట్స్ ఫోజులో కనిపించడాన్ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ సినిమా విడుదల అవ్వబోతున్న విషయాన్ని కూడా మర్చిపోయి ఫ్యాన్స్ మొత్తం #OG జపం చెయ్యడం మొదలు పెట్టారు.

- Advertisement -

ఇది కేవలం వర్కింగ్ స్టిల్ మాత్రమే అని, అసలు సిసలు ఫస్ట్ లుక్ ఆగస్టు 15 వ తారీఖున విడుదల అవ్వబోతుందని, అది చూస్తే ఇక ఫ్యాన్స్ ఏమైపోతారో అని ఈ సినిమాలో పని చేస్తున్న కొంతమంది క్రూ సభ్యులు చెప్తున్నారు. ఆగష్టు 15 వ తారీఖున ఫస్ట్ లుక్ విడుదల చేసి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. దీనికి గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే బయటకి రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here