Pawan Kalyan : మహేష్ బాబు అక్క నిర్మాతగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

- Advertisement -

Pawan Kalyan : అప్పట్లో టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్ – ఏఎన్నార్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళిద్దరి తరం తర్వాత కృష్ణ – శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి- బాలకృష్ణ ఇలా ప్రతీ తరానికి ఇద్దరు టాప్ హీరోలు ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉండే వాళ్ళు. అయితే నేటి తరం లో అలా పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు టాప్ 2 హీరోలని ఇండస్ట్రీ లో అందరూ అంటూ ఉంటారు.

Pawan Kalyan
Pawan Kalyan

టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది వీళ్ళిద్దరే అని, ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం నువ్వా నేనా అనే రేంజ్ లో పెట్టే హీరోలు వీళ్ళే అని ట్రేడ్ బలంగా నమ్ముతుంది. వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క మల్టిస్టార్రర్ సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం షేక్ అవుతాయని, కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసిస్తారని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు.

కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ మల్టీస్టార్ర్ర్ సినిమా వచ్చే సంగతి దేవుడెరుగు, ఈమధ్య కాలం లో కనీసం వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క ఫోటో కూడా రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కలుసుకున్నారు కానీ విషాదకరమైన సందర్భం లో కలవబట్టి ఫ్యాన్స్ కూడా పెద్దగా థ్రిల్ అవ్వలేకపోయారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా, లేకపోతే వీళ్లిద్దరు కలిసి ఫోటోలు దిగుతారా లేదా అనేది పక్కన పెడితే, మహేష్ బాబు అక్క గారు మంజుల త్వరలోనే తన నిర్మాణ సంస్థ ని తిరిగి ప్రారంభించబోతుందని.

- Advertisement -

ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తుందని, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందట. కనీసం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడైనా పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు కలుసుకుంటారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here